Share News

Protest Rules: శవ రాజకీయాలు చేస్తే ఐదేళ్లు జైలు

ABN , Publish Date - Dec 08 , 2025 | 03:38 AM

శవాలను గౌరవించే చట్టాన్ని రాజస్థాన్‌ ప్రభుత్వం ఆదివారం నుంచి అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం.. శవంతో నిరసనలు తెలపడం....

Protest Rules: శవ రాజకీయాలు చేస్తే ఐదేళ్లు జైలు

జైపుర్‌, డిసెంబరు 7: శవాలను గౌరవించే చట్టాన్ని రాజస్థాన్‌ ప్రభుత్వం ఆదివారం నుంచి అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం.. శవంతో నిరసనలు తెలపడం, శవాలను రాజకీయంగా వినియోగించడం వంటి చర్యలను ప్రభుత్వం క్రిమినల్‌ నేరాలుగా పరిగణిస్తుంది. మరణించిన వ్యక్తి అంత్యక్రియలను 24 గంటల్లోపు పూర్తిచేయాలి. కుటుంబసభ్యులు రాష్ట్రం వెలుపల ఉండడం లేదా పోస్టుమార్టం రాష్ట్రం వెలుపల జరిగిన సందర్భాల్లో మాత్రమే మినహాయింపు ఉంటుంది. రాజకీయ, సామాజిక ఒత్తిడి కారణంగా కుటుంబసభ్యులు శవాన్ని స్వీకరించకపోతే.. వారిపైనా అధికారులు చర్యలు తీసుకుంటారు. శవంతో నిరసనలు తెలపడం, రోడ్లను దిగ్బంధించడం, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై ఈ చట్టం ప్రకారం గరిష్ఠంగా 5 ఏళ్ల వరకు జైలుశిక్షతో పాటు జరిమానానూ విధించే అవకాశం ఉంది.

Updated Date - Dec 08 , 2025 | 03:38 AM