Biometric System: రైల్వే టీటీఐలకూ బయోమెట్రిక్
ABN , Publish Date - Sep 08 , 2025 | 03:36 AM
రైళ్లలో టికెట్ తనిఖీ సిబ్బందికి బయో మెట్రిక్ సైన్ ఆన్, సైన్ ఆ్‌ఫ విధానాన్ని తేవాలని దక్షిణ మధ్య రైల్వే ...
ప్రయోగాత్మకంగా 6 స్టేషన్లలో అమలు
రెండో దశలో 73 స్టేషన్లకు విస్తరణ: ఎస్‌సీఆర్
హైదరాబాద్ సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రైళ్లలో టికెట్ తనిఖీ సిబ్బందికి బయో మెట్రిక్ సైన్-ఆన్, సైన్-ఆ్‌ఫ విధానాన్ని తేవాలని దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి దశలో ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ స్టేషన్లలో అమలు చేస్తున్న బయో మెట్రిక్ విధానం.. తదుపరి దశలో జోన్‌లోని 73 స్టేషన్లకు విస్తరిస్తారు. గతంలో టికెట్ తనిఖీ సిబ్బంది పేరు, పాస్‌వర్డ్ ఉపయోగించి సైన్-ఇన్, సైన్-ఆ్‌ఫ అమలు చేశారు. తాజాగా ట్రావెలింగ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ (టీటీఐ) లాబీల్లో ఆధార్ ఆధారిత బయో మెట్రిక్ సైన్-ఆన్/ సైన్-ఆ్‌ఫ విధానం తీసుకొచ్చారు. టీటీఐ లాబీ యాప్‌లో ఫింగర్ ప్రింట్ పరికరాన్ని సి-డిఎసి పోర్టల్‌తో అనుసంధానిస్తారు. తద్వారా టికెట్ తనిఖీ సిబ్బంది ప్రత్యక్ష హాజరుతోపాటు లాగిన్, లాగౌట్ వాస్తవ సమయాలు నమోదవుతాయి. బయో మెట్రిక్ సైన్ వినియోగంతో సిబ్బంది, అధికారుల్లో మరింత బాధ్యత పెరుగుతుందన్న ఎస్‌సీఆర్ జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ.. మరింత సమర్థవంతంగా సేవలందించే అవకాశం ఉంటుందన్నారు.