Indian Railways: రైల్‌వన్ యాప్‌లో అన్‌రిజర్వ్‌డ్ టికెట్లపై 3శాతం రాయితీ
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:23 AM
కొత్తగా ప్రవేశపెట్టిన రైల్‌వన్ యాప్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు డిస్కౌంట్ కల్పిస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ, డిసెంబరు 30: కొత్తగా ప్రవేశపెట్టిన రైల్‌వన్ యాప్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు డిస్కౌంట్ కల్పిస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్ ద్వారా అన్ రిజర్వ్‌డ్(జనరల్) టికెట్లను ఏ డిజిటల్ చెల్లింపు విధానం ద్వారా కొనుగోలు చేసినా 3 శాతం రాయితీ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ 2026 జనవరి 14 నుంచి జూలై 14 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం రైల్‌వన్ యాప్‌లో ఆర్-వాలెట్ ద్వారా చెల్లింపులు చేసిన వారికి మాత్రమే 3శాతం క్యాష్‌బ్యాక్ అందుతోంది. అయితే, డిజిటల్ టికెట్ బుకింగ్‌ను మరింత ప్రోత్సహించాలనే లక్ష్యంతో.. అన్ని డిజిటల్ చెల్లింపు విధానాలకు రాయితీని విస్తరించాలని నిర్ణయించినట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఈ మేరకు అవసరమైన సాఫ్ట్‌వేర్ మార్పులు చేపట్టాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్‌ఐఎ్‌స)కు ఆదేశాలు జారీ చేసింది.