Rahul Gandhi: షా చేతులు వణికాయి
ABN , Publish Date - Dec 12 , 2025 | 03:51 AM
న్నికల సంస్కరణలపై లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు ఆందోళనగా కనిపించారని...
అమిత్ షా మానసిక ఒత్తిడిలో ఉన్నారు
ఆందోళనగా కనిపించారు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ, డిసెంబరు 11: ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు ఆందోళనగా కనిపించారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రసంగించే సమయంలో షా చేతులు వణికాయన్నారు. ఆయన వాడిన భాష కూడా సరిగా లేదన్నారు. షా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారనేది దేశం మొత్తం చూసిందని రాహుల్ చెప్పారు. తాను అడిగిన ఒక్క ప్రశ్నకూ సూటిగా సమాధానం చెప్పలేకపోయారని, ఆధారాలు కూడా చూపించలేకపోయారని రాహుల్ ఆరోపించారు.
జ్వరంతోటే ప్రసంగం!
అయితే లోక్‌సభలో ప్రసంగించే సమయంలో అమిత్ షా కు 102 డిగ్రీల జ్వరం ఉందని, డాక్టర్ల సలహాతో ఆయన టాబ్లెట్లు వేసుకున్నారని బీజేపీ వర్గాల ద్వారా తెలిసింది. అంతకుముందు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై రాహుల్ ఆరోపణలకు షా కౌంటరిచ్చారు. 90 నిమిషాలకు పైగా ప్రసంగించిన ఆయన కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం వల్లే ఎన్నికల్లో ఓడిపోతున్నారని.. ఓట్ చోరి, ఈవీఎంల వల్ల కాదని ఎద్దేవా చేశారు. నిజానికి ఓట్ చోరీ చేసింది కాంగ్రెస్సేనంటూ ఆయన మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీతో పాటు పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్లను ప్రస్తావించారు.