Rahul Gandhi: దేశమంతా తెలంగాణ ఫార్ములా
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:33 AM
దేశ వనరుల్లో హక్కు కోసం దేశవ్యాప్తంగా కులగణన అవసరమని, 50 శాతం రిజర్వేషన్ పరిమితిని బద్దలకొట్టతామని రాహుల్ గాంధీ ప్రకటించారు. తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా బలహీనవర్గాలకు వాటా కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.

50ు రిజర్వేషన్ల పరిమితిని బద్దలు కొడతాం
సమాజంలో 90 శాతం బలహీనవర్గాలు, పేదలేనని తెలంగాణ సర్వేలో తేలింది
వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం
బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ ఇకపై క్రిస్టియన్లు, సిక్కులు, ఇతర మైనార్టీల హక్కులపై పడతాయి
ట్రంప్ టారి్‌ఫ ఒత్తిళ్లకు మోదీ లొంగిపోయారు
56 అంగుళాల ఛాతీ ఎక్కడ?: రాహుల్‌గాంధీ
దేశంలో పది శాతం కార్పొరేట్ శక్తుల చేతుల్లో 90 శాతం సంపద పోగుపడిందని వ్యాఖ్య
అహ్మదాబాద్, ఏప్రిల్ 9: తాము అధికారంలోకి వస్తే దేశంలో 50 శాతం రిజర్వేషన్ల పరిమితి బద్దలుకొడతామని, ఇందుకోసం తెలంగాణ ఫార్ములాను అమలు చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. జనగణనలో భాగంగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, మత సేచ్ఛపై దాడి అని అభివర్ణించారు. బీజేపీ-ఆర్‌ఎ్‌సఎ్‌సలు త్వరలోనే క్రిస్టియన్లు, సిక్కులు, ఇతర మైనారిటీల హక్కులపై పడతాయని వ్యాఖ్యానించారు. బుధవారం ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రాహుల్ మాట్లాడారు. ‘‘నేను బలహీనవర్గాల వారి కోసం పనిచేస్తున్నాను. దేశ వనరుల్లో ఎవరి వాటా ఎంత అనేది తేలాల్సి ఉంది. ్ఞ్ఞఅందుకు కులగణన చేయాలి. మేం తెలంగాణలో చేశాం. ఢిల్లీలో, దేశవ్యాప్తంగా కూడా చేసి చూపిస్తాం. రిజర్వేషన్లకు ఉన్న 50 శాతం పరిమితి అడ్డుగోడను బద్దలుకొడతాం. తెలంగాణలో చేసిన కులగణనలో సమాజంలో 90ు మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని తేలింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ వారి గోడు పట్టించుకునేవారు లేరు. దేశవ్యాప్తంగా కులగణన చేపడితే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. నిర్ణయాధికారంలో వారి వాటా ఏమిటో వెల్లడవుతుంది’’ అని రాహుల్ చెప్పారు. టారి్‌ఫలపై ట్రంప్ ఒత్తిళ్లకు ప్రధాని మోదీ లొంగిపోయారని, దేశంలో ఆర్థిక తుఫాను రాబోతోందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘56 అంగుళాల ఛాతీ ఎక్కడ పోయింది?’’ అని ప్రశ్నించారు. దేశంలో పది శాతం కార్పొరేట్ శక్తుల చేతుల్లో 90 శాతం సంపద పోగుపడిందని వ్యాఖ్యానించారు.