Share News

చైనా విడిభాగాలను ఇక్కడ కలపడమే మేక్‌ ఇన్‌ ఇండియా నా రాహుల్‌ గాంధీ

ABN , Publish Date - Jul 20 , 2025 | 06:11 AM

మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో సొంతంగా తయారుచేస్తున్నది తక్కువేనని ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ అన్నారు. టీవీకి సంబంధించిన 80ు విడి భాగాలు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ పేరిట చైనా నుంచి దిగుమతి...

చైనా విడిభాగాలను ఇక్కడ కలపడమే మేక్‌ ఇన్‌ ఇండియా నా రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ, జూలై 19: మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో సొంతంగా తయారుచేస్తున్నది తక్కువేనని ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ అన్నారు. టీవీకి సంబంధించిన 80ు విడి భాగాలు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ పేరిట చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారని తెలిపారు. దీంతో ఐఫోన్‌, టీవీ తదితర వస్తువుల విడి భాగాలను కలిపే ప్రక్రియగా ఈ కార్యక్రమం మిగిలిపోయిందని రాహుల్‌ విమర్శించారు. దేశంలో తయారీరంగం బలపడాలంటే క్షేత్రస్థాయిలో మార్పులు రావాల్సి ఉందని ‘ఎక్స్‌’లో ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘జీడీపీలో తయారీరంగం వాటా 2014లో 15.3ు ఉండగా, ఇప్పుడది 12.6 శాతానికి క్షీణించింది. ఇంత క్షీణత ఈ రంగంలో నమోదుకావడం 60ఏళ్లలో ఇదే తొలిసారి’’ అని రాహుల్‌ అన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 06:11 AM