Rahul Gandhi: లద్దాఖ్ ప్రజలపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దాడి
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:10 AM
లద్దాఖ్‌లో చోటుచేసుకున్న ఘటనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లద్దాఖ్ ప్రజలపై, వారి సంస్కృతీ సంప్రదాయాలపై....
భయపెట్టే ధోరణి మానుకోవాలి: రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: లద్దాఖ్‌లో చోటుచేసుకున్న ఘటనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లద్దాఖ్ ప్రజలపై, వారి సంస్కృతీ సంప్రదాయాలపై బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ దాడి చేస్తున్నాయని ఆరోపించారు. ‘‘లద్దాఖ్ ప్రజలు తమ గొంతు వినిపించాలనుకున్నారు. సమాధానం ఆశించారు. కానీ, ఇందుకు సమాధానంగా బీజేపీ నలుగురు వ్యక్తులను చంపి, ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్‌ను జైల్లో పెట్టింది’’ అని ‘ఎక్స్’లో రాహుల్ పేర్కొన్నారు. ఈ హింసను వెంటనే ఆపాలని, భయపెట్టే ధోరణిని మానుకోవాలని డిమాండ్ చేశారు. లద్దాఖ్‌కు తమ వాణి వినిపించే అవకాశం ఇవ్వాలని, ఆ ప్రాంతాన్ని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని అన్నారు. కాగా, లేహ్‌లో ఆదివారం ఐదో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగింది. అయితే పౌరుల రోజువారీ పనుల కోసం 4 గంటలపాటు సడలించారు.