Share News

Rahul Gandhi: కాంగ్రె్‌స పార్టీలో రెండు రకాల గుర్రాలు

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:26 AM

కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్యలపై రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీని మరింత బలవంతంగా మారుస్తామని, సరైన నాయకులకు సరైన బాధ్యతలు అప్పగిస్తామన్నారు. కొంతమంది నేతలు బీజేపీతో అంటకాగుతున్నారని, అలాంటి వారిని బయట పెట్టాల్సి ఉందని చెప్పారు.

Rahul Gandhi: కాంగ్రె్‌స పార్టీలో రెండు రకాల గుర్రాలు

రేసులో వాడే వాటిని పెళ్లికి.. పెళ్లికి వాడే వాటిని రేసులకు పంపుతున్నాం

పార్టీ నేతలకు అప్పగిస్తున్న బాధ్యతలపై రాహుల్‌ వ్యాఖ్య

అహ్మదాబాద్‌, ఏప్రిల్‌ 16: కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్యలను ప్రస్తావిస్తూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం గుజరాత్‌లోని మోదాసాలో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీలో రెండు రకాల గుర్రాలు ఉన్నాయి. ఒకరకమేమో రేసుల్లో దౌడు తీసేవి, రెండో రకం పెళ్లిలో ఊరేగింపులకు వాడేవి. కాంగ్రెస్‌ చాలా సార్లు పెళ్లికి వాడే గుర్రాలను రేసులకు, రేసు గుర్రాలను పెళ్లిళ్లకు పంపుతోందని కొందరు నాతో చెబుతున్నారు. ఇప్పుడా పరిస్థితిని సరిచేయాలి’’ అని రాహుల్‌ పేర్కొన్నారు. ఇకపై సరైన నేతలకు సరైన బాధ్యతలు అప్పగిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో కొందరు నేతలు బీజేపీతో అంటకాగుతున్నారని, అలాంటి వారిని గుర్తించి బయటికి పంపాల్సి ఉందన్నారు. పార్టీలో అంతర్గతంగా మార్పు లు రావాల్సి ఉందని ఆయన చెప్పారు.


ఇవి కూడా చదవండి...

Rahul Gandhi: రెండు రకాల గుర్రాలు.. గుజరాత్‌లో కాంగ్రెస్ వ్యూహంపై రాహుల్

BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ

Ramdev: రామ్‌దేవ్ 'షర్‌బత్ జిహాద్' వ్యాఖ్యలపై దిగ్విజయ్ కేసు

Updated Date - Apr 17 , 2025 | 04:40 AM