Rahul Gandhi: ఉపరాష్ట్రపతి ఎన్నికలోనూ ఓట్ల చోరీ
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:02 AM
ఉపరాష్ట్రపతి ఎన్నికలో కూడా ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ..
న్యూఢిల్లీ/రాయ్‌బరేలీ, సెప్టెంబరు 10: ఉపరాష్ట్రపతి ఎన్నికలో కూడా ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఎన్‌డీఏ అభ్యర్థి ీరాధాకృష్ణన్‌కు అనుకూలంగా ‘ఇండీ’ కూటమి నుంచి క్రాస్ ఓటింగ్ జరగడంపై బుధవారం రాయ్‌బరేలీలో ఓ ఆంగ్ల చానల్ ప్రతినిధి ఆయన్ను ప్రశ్నించగా.. బీజేపీ దేశవ్యాప్తంగా ఓట్లు దొంగిలిస్తోందని ఆయన బదులిచ్చారు. ఓట్ల దొంగ గద్దె దిగాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఉపరాష్ట్రపతి ఎన్నికలో ‘ఇండీ’ కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి అనుకున్నదాని కంటే తక్కువ ఓట్లు రావడంపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఉద్ధవ్ శివసేన, డీఎంకే ఎంపీల్లో కొందరు క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విచారణ జరపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మహారాష్ట్ర నుంచి 7 ఓట్లు ఎన్‌డీఏకి క్రాస్ అయినట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి నలుగురు, ఉద్ధవ్ సేన నుంచి ముగ్గురు రాధాకృష్ణన్‌కు ఓటేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన తమిళనాడువాసి కావడంతో.. కొందరు డీఎంకే సభ్యులు కూడా ఆయనకు ఓటేసి ఉంటారని తెలుస్తోంది.