Rabies Claims One Life: రేబిస్‌కు ప్రతి 9 నిమిషాలకొకరు బలి
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:05 AM
రేబిస్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒకరిని బలిగొంటోందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అత్యవసరంగా వ్యాక్సినేషన్....
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: రేబిస్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒకరిని బలిగొంటోందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అత్యవసరంగా వ్యాక్సినేషన్, అవగాహన చేపట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ప్రపంచవ్యాప్త మరణాల్లో మూడో వంతు భారతదేశంలోనే జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వీధికుక్కల సంఖ్య కోట్లలో ఉండటమే దీనికి కారణం. రేబిస్ సంక్రమణను అడ్డుకునేందుకు కుక్కలకు సామూహికంగా వ్యాక్సినేషన్, పీఈపీ(పో్‌స్ట-ఎక్స్‌పోజర్ ప్రోఫైలాక్సిస్) సకాలంలో అందడం కీలకమని ప్రపంచ రేబిస్ దినోత్సవం(సెప్టెంబరు 28) సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో పునరుద్ఘాటించింది. ఐడీఎ్‌సపీ(ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్) కింద పార్లమెంటుకు సమర్పించిన సమాచారం మేరకు 2024 సంవత్సరంలో భారతదేశంలో 37 లక్షల కుక్క కాటు కేసులు, 54 అనుమానిత రేబిస్ మరణాలు సంభవించాయి. ఇక 2023లో 286 రేబిస్ సంబంధిత మరణాలు సంభవించాయని డీఏహెచ్‌డీ(పశు సంవర్థక, డెయిరీ విభాగం) నివేదించింది. కాగా, 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా రేబి్‌సను అంతమొందించాలనే లక్ష్యానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేడీ నడ్డా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌సీపీ(జాతీయ రేబిస్ నియంత్రణ కార్యక్రమం) ద్వారా ప్రభుత్వం ప్రజల్లో అవగాహనను పెంపొందిస్తోందని, వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూస్తోందని పేర్కొన్నారు. కాగా, వ్యాక్సినేషన్ 70ు సాధిస్తే.. రేబిస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని పలు దేశాల్లో నిరూపితమైంది.