Share News

Nitin Gadkari: నేనొక్కడినే ఎందుకు తిట్లు తినాలి!

ABN , Publish Date - Oct 30 , 2025 | 04:01 AM

మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై క్యూఆర్‌ కోడ్‌ స్కానర్లను...

Nitin Gadkari: నేనొక్కడినే ఎందుకు తిట్లు తినాలి!

  • రోడ్లపై క్యూఆర్‌ కోడ్‌ల ఏర్పాటు

  • స్కాన్‌ చేస్తే కాంట్రాక్టర్ల వివరాలు

  • నేరుగా వారినే ప్రశ్నించొచ్చు: గడ్కరీ

న్యూఢిల్లీ, అక్టోబరు 29: మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై క్యూఆర్‌ కోడ్‌ స్కానర్లను ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రతిపాదించారు. ప్రజలు ఆ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి ఆ రోడ్డుకు సంబంధించిన పూర్తి వివరాలు పొందగలరన్నారు. ఆ ప్రాజెక్టు కోసం పనిచేసిన కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారుల పేర్లు-ఫోన్‌ నంబర్లు, ఆ పనికి మంజూరు చేసిన బడ్జెట్‌, గడువు, నిర్వహణ వంటి కీలక విషయాలు తెలుసుకోవచ్చన్నారు. ‘స్మార్ట్‌ రోడ్ల భవిష్యత్తు, భద్రత’ అనే అంశంపై బుధవారం ఢిల్లీలో జరిగిన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. రోడ్లు బాగా లేకుంటే తననే అందరూ నిందిస్తారని.. మొత్తం వ్యవస్థ చేసిన తప్పులకు తానొక్కడినే ఎందుకు తిట్లు తినాలని సరదాగా అన్నారు. అందుకే రోడ్లకు సంబంధించిన సమాచారాన్ని బహిరంగంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నానని.. అప్పుడే అవినీతికి పాల్పడే వారికి నేరుగా ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నాన్నారు. ‘రోడ్లపై క్యూఆర్‌ కోడ్‌ల ఏర్పాటుతో దాన్ని మంజూరు చేసిన మంత్రి ఎవరు? నిర్మాణ కాంట్రాక్టర్లు, కార్యదర్శులు, ఇంజనీర్లు వారి ఫోన్‌ నంబర్లు, చిరునామా, ఫొటోలతో సహా ప్రజలు, మీడియాకు అందుబాటులో ఉంటాయి. తద్వారా సదరు రోడ్డు దెబ్బతిన్న, గుంతలు ఏర్పడిన నేరుగా వారికే ఫోన్‌ చేసి ప్రశ్నిస్తారు’ అని గడ్కరీ వివరించారు.

Updated Date - Oct 30 , 2025 | 04:01 AM