Share News

Vladimir Putin: రాజ్‌ఘాట్‌ను సందర్శించిన పుతిన్‌

ABN , Publish Date - Dec 06 , 2025 | 04:01 AM

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శుక్రవారం ఉదయం మహాత్మా గాంధీ సమాఽధి రాజ్‌ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. అక్కడ ఉన్న సందర్శకుల పుస్తకంలో .....

Vladimir Putin: రాజ్‌ఘాట్‌ను సందర్శించిన పుతిన్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 5: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శుక్రవారం ఉదయం మహాత్మా గాంధీ సమాఽధి రాజ్‌ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. అక్కడ ఉన్న సందర్శకుల పుస్తకంలో మహాత్ముని సేవలను ప్రస్తుతిస్తూ రష్యన్‌ భాషలో రాశారు. మహాత్ముడు శాంతి, సత్యం, అహింస ద్వారా ఈ భూగోళానికి ఎనలేని సేవలు చేశారని పేర్కొన్నారు. ఆయన బోధనల అవసరం నేటి ప్రపంచానికి ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. రష్యా వాటిని పాటిస్తోందని తెలిపారు. రష్యా ప్రభుత్వ టీవీ ఛానెల్‌ ‘ఆర్‌టీ ఇండియా’ను పుతిన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌ లెజెండ్‌ రాజ్‌ కపూర్‌ను గుర్తు చేశారు. బాలీవుడ్‌ సినిమాలు, రాజ్‌ కపూర్‌కు రష్యాలో ఎంతో ఆదరణ ఉండేదని చెప్పారు.

Updated Date - Dec 06 , 2025 | 04:01 AM