Jagannath Rath Yatra: పూరీ రథయాత్రకు తొలిరోజు 10 లక్షల మంది
ABN , Publish Date - Jun 29 , 2025 | 04:02 AM
పూరీ జగన్నాథుడి రథయాత్రకు తొలిరోజు(శుక్రవారం) దాదాపు 10లక్షల మంది హాజరయ్యారు. జనం భారీగా పోటెత్తడంతోపాటు ఎండ తీవ్రంగా ఉండటంతో దాదాపు 625 మంది అస్వస్థతకు గురయ్యారు.
పూరీ, జూన్ 28: పూరీ జగన్నాథుడి రథయాత్రకు తొలిరోజు(శుక్రవారం) దాదాపు 10లక్షల మంది హాజరయ్యారు. జనం భారీగా పోటెత్తడంతోపాటు ఎండ తీవ్రంగా ఉండటంతో దాదాపు 625 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో చాలామంది ఆస్పత్రుల్లో చేరాల్సి వచ్చిందని అధికారులు శనివారం వెల్లడించారు. కొందరికి స్వల్ప గాయాలవగా, మరికొందరికి వాంతులయ్యాయి. 200 మందికిపైగా స్పృహతప్పి పడిపోయారు. తొలిరోజే సాయంత్రానికి దేవతామూర్తులు బలభద్రుడు, దేవీ సుభద్ర, జగన్నాథుల రథాలు 2.6 కిలోమీటర్ల దూరంలోని వారి మేనత్త స్వస్థలమైన గుండిచ ఆలయానికి చేరుకోవాల్సి ఉండగా, బలగండిలో బలభద్రుడి రథం ఇరుక్కుపోవడం వల్ల శుక్రవారం రాత్రి రథాలను అక్కడే నిలిపేశారు. తిరిగి శనివారం ఉదయం 10 గంటలకు కదిలిన రథాలు గుండిచ ఆలయానికి చేరుకున్నాయి.