Share News

PSLV Rockets: ఎస్‌ఎస్‌‌ఎల్వీ తయారీ ఇక హాల్‌ బాధ్యత

ABN , Publish Date - Jun 21 , 2025 | 06:18 AM

పీఎస్‌ఎల్వీ రాకెట్ల తయారీ హక్కులను ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) దక్కించుకుందని ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పేస్‌) శుక్రవారం వెల్లడించింది.

PSLV Rockets: ఎస్‌ఎస్‌‌ఎల్వీ తయారీ ఇక హాల్‌ బాధ్యత

  • ఇస్రో నుంచి టెక్నాలజీ.. రూ.511 కోట్లతో డీల్‌

న్యూఢిల్లీ, జూన్‌ 20: పీఎస్‌ఎల్వీ రాకెట్ల తయారీ హక్కులను ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) దక్కించుకుందని ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పేస్‌) శుక్రవారం వెల్లడించింది. ఈ డీల్‌ విలువ రూ.511 కోట్లు. ఎస్‌ఎ్‌సఎల్వీ సాంకేతికత బదిలీ కోసం ఇస్రో బిడ్లు పిలవగా.. అదానీ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన ఆల్ఫా డిజైన్‌ టెక్నాలజీస్‌, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ సంస్థలను వెనక్కు నెట్టి బెంగళూరుకు చెందిన హాల్‌ ఈ బిడ్‌ను దక్కించుకుందని ఇన్‌-స్పేస్‌ చైర్మన్‌ పవన్‌ గోయెంకా తెలిపారు.


ఈ డీల్‌లో భాగంగా హాల్‌... రెండేళ్లపాటు ఇస్రోతో కలిసి పనిచేస్తుందని, ఈ సమయంలో ఇస్రో అందించే టెక్నాలజీతో రెండు ఎస్‌ఎ్‌సఎల్వీ రాకెట్లను తయారు చేయాల్సి ఉంటుందని గోయెంకా పేర్కొన్నారు. మూడో రాకెట్‌ నుంచి దాని డిజైన్‌ను మెరుగుపరచడానికి, వాటిని ఎవరికి విక్రయించాలో నిర్ణయించుకోవడానికి హాల్‌కు స్వేచ్ఛ ఉంటుందని ఆయన చెప్పారు. ఎస్‌ఎ్‌సఎల్వీ తయారీ బిడ్‌ను దక్కించుకోవడం గర్వంగా ఉందని హాల్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ బి సేనాపతి అన్నారు. కాగా, అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ కంపెనీలు స్కైరూట్‌ ఏరోస్పేస్‌, అగ్నికుల్‌ కాస్మోస్‌ తర్వాత రాకెట్లను తయారు చేసే మూడో సంస్థగా హాల్‌ నిలవనుంది.

Updated Date - Jun 21 , 2025 | 06:18 AM