Protests Erupt Against Shehbaz Sharif : పీవోకేలో షెహబాజ్ సర్కారుకు సెగ
ABN , Publish Date - Sep 30 , 2025 | 03:53 AM
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ పీవోకేలో ఆందోళనలు మిన్నంటాయి....
హక్కుల కోసం గళమెత్తిన జనం.. వేలమందితో వీధుల్లో ప్రదర్శనలు
హింసాత్మకంగా ఆందోళనలు.. ఇద్దరు మృతి.. 22 మందికి గాయాలు
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో ఆందోళనలు మిన్నంటాయి. అవామీ యాక్షన్ కమిటీ(ఏఏసీ) ఆధ్వర్యంలో పీవోకే వ్యాప్తంగా సోమవారం వేలాదిమందితో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ముజఫరాబాద్‌లో ఇద్దరు మరణించగా, 22 మంది గాయాలపాలయ్యారు. నిరవధిక బంద్‌కు ఏఏసీ పిలుపునివ్వడంతో పాక్ ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను రంగంలోకి దించింది. పీవోకే వ్యాప్తంగా ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. ప్రాథమిక హక్కుల కోసం నినదిస్తున్న పౌరులపైకి పాక్ సైన్యం కాల్పులు జరిపిందని ఆందోళనకారులు ఆరోపించారు.