Share News

Rehan Vadra gets engaged to Aviva Baig: గర్ల్‌ఫ్రెండ్‌ అవీవా బేగ్‌తో ప్రియాంక గాంధీ కుమారుడి నిశ్చితార్థం!

ABN , Publish Date - Dec 31 , 2025 | 04:15 AM

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడి వివాహం నిశ్చయమైంది. ప్రియాంక గాంధీ- రాబర్ట్‌ వాద్రా దంపతుల కుమారుడు రేహాన్‌ వాద్రా..

Rehan Vadra gets engaged to Aviva Baig: గర్ల్‌ఫ్రెండ్‌ అవీవా బేగ్‌తో ప్రియాంక గాంధీ కుమారుడి నిశ్చితార్థం!

న్యూఢిల్లీ, డిసెంబరు 30: కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడి వివాహం నిశ్చయమైంది. ప్రియాంక గాంధీ- రాబర్ట్‌ వాద్రా దంపతుల కుమారుడు రేహాన్‌ వాద్రా(25)కు అతని గర్ల్‌ఫ్రెండ్‌ అవీవా బేగ్‌(23)తో నిశ్చితార్థం జరిగిందని గాంధీ కుటుంబసన్నిహిత వర్గాలు తెలిపాయి. రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రణ్‌థంబోర్‌లో నిర్వహించిన ప్రైవేటు కార్యక్రమంలో ఈ వేడుక జరిగినట్టు వెల్లడించాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. రేహాన్‌, అవీవా ఏడేళ్లుగా స్నేహితులు. ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో రేహాన్‌ ఇటీవల చేసిన పెళ్లి ప్రతిపాదనకు అవీవా అంగీకారం తెలిపారు. ఢిల్లీకి చెందిన అవీవా బేగ్‌ తండ్రి ఇమ్రాన్‌ బేగ్‌ వ్యాపారవేత్త, తల్లి నందిత బేగ్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌. ఇమ్రాన్‌ ముస్లిం, నందిత హిందువు. నందిత, ప్రియాంక గాంధీ చాలా కాలంగా స్నేహితులు కావడంతో ఇరుకుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ పనులు నందిత ఆధ్వర్యంలోనే జరిగాయి.

Updated Date - Dec 31 , 2025 | 04:15 AM