Sugarcane: చెరకు గిట్టుబాటు ధర రూ.355కు పెంపు
ABN , Publish Date - May 01 , 2025 | 05:00 AM
ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన క్యాబినెట్ కమిటీ సమావేశంలో చెరుకు రైతుల గిట్టుబాటు ధరను క్వింటాల్‌కి రూ.355కి పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం 2025-26 సీజన్ నుండి అమలు అవుతుంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: చెరకు రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. చెరుకు గిట్టుబాటు ధర(ఎ్‌ఫఆర్‌పీ)లను క్వింటాల్‌కు 4.41ు మేర పెంచి రూ.355 చేసింది. ఈ ఏడాది అక్టోబరు నుంచి ప్రారంభమయ్యే 2025-26 సీజన్ నుంచి ఈ ధరలు అమలులోకి వస్తాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. షుగర్ మిల్లులు చెరుకు రైతులకు చెల్లించే కనీస గిట్టుబాటు ధరను ఎఫ్‌ఆర్‌పీ(ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్) అంటారు. ప్రస్తుతం 2024-25 సీజన్‌కు గాను ఈ ఎఫ్‌ఆర్‌పీ క్వింటాల్‌కు రూ.340గా ఉంది.
Also Read:
BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..