Hema Malini: ధర్మేంద్ర ఆరోగ్యం కోసం ప్రార్థించండి
ABN , Publish Date - Nov 11 , 2025 | 02:07 AM
అలనాటి సినీహీరో ధర్మేంద్ర (89) అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు...
అభిమానులకు హేమమాలిని వినతి
ముంబై, నవంబరు 10: అలనాటి సినీహీరో ధర్మేంద్ర (89) అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన కోలుకోవాలంటూ ప్రార్థించాలని ప్రముఖ నటి, భార్య హేమమాలిని అభిమానులను కోరారు. సోమవారం ఈ మేరకు ఆమె ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘‘ధరంజీ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. ఆయన ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వైద్యులు నిరంతరం ఆయనను గమనిస్తున్నారు. మేమంతా ఆయన పక్కనే ఉన్నాం. ఆయన సత్వరమే కోలుకోవాలని, సుఖంగా ఉండాలంటూ ప్రార్థించాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. ధర్మేంద్ర పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికయితే నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన వెంటిలేటర్‌పై ఏమీ లేరని పేర్కొన్నాయి. క్రమేణా కోలుకుంటున్నారని తెలిపాయి.