Share News

Prakash Raj: ప్రాంతీయ భాషలను దెబ్బతీస్తే ఉపేక్షించేది లేదు

ABN , Publish Date - Dec 20 , 2025 | 04:36 AM

ఉత్తర భారత దేశంలో చాలా రాష్ట్రాల వారికి హిందీ మాత్రమే వచ్చని, వారికి ఇతర భాషలు రావని.. దీంతో వాళ్లు దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారని సినీ ప్రాంతీయ భాషలను దెబ్బతీస్తే ఉపేక్షించేది లేదు నటుడు ప్రకాశ్‌రాజ్‌...

Prakash Raj: ప్రాంతీయ భాషలను దెబ్బతీస్తే ఉపేక్షించేది లేదు

  • అన్నీ భాషలనూ గౌరవించాలి:ప్రకాశ్‌రాజ్‌

  • ‘దక్షి ణ భారతభాషలు: గుర్తింపు,రాజకీయాలు’ అనే అంశంపై జాతీయ సదస్సు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉత్తర భారత దేశంలో చాలా రాష్ట్రాల వారికి హిందీ మాత్రమే వచ్చని, వారికి ఇతర భాషలు రావని.. దీంతో వాళ్లు దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారని సినీ ప్రాంతీయ భాషలను దెబ్బతీస్తే ఉపేక్షించేది లేదు నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి సంపాదించుకోవడానికి వచ్చి దక్షిణాది రాష్ట్రాల భాషలను, సంస్కృతిని దెబ్బతీయాలని చూస్తూ ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. మాతృభాషతో పాటు ఇతర భాషలపై అభిమానం, గౌరవం ఉండాలని ఆయన సూచించారు. అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వ విద్యాలయం, కళల విభాగ ఆధ్వర్యంలో ‘‘దక్షిణ భారత భాషలు: గుర్తింపు, రాజకీయాలు’’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. అందులో పాల్గొన్న ప్రకాశ్‌రాజ్‌.. దక్షణాది రాష్ట్రాల భాషలపై దాడి జరుగుతోందని, అందుకే భాషను కాపాడుకోవడానికి దక్షణాది రాష్ట్రాల్లో సదస్సులు, సమావేశాలు విరివిగా జరగుతున్నాయన్నారు. ‘‘నా మాతృ భాష కన్నడ.. కానీ నేను తెలుగుతో సహా 7 భాషలు మాట్లాడతా. నాకు నా మాతృభాషతో పాటు ఇతర భాషలపై అభిమానం, గౌరవం ఉన్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘అమ్మ భాష అనేది మన సృంస్కృతి. మన ధ్వని. మన గర్వం. మన గుర్తింపు. దీన్ని ఎవరు దెబ్బతీయాలని చూసినా ఊరుకోం. ఎట్టి పరిస్థితుల్లో మా ఉనికిని వదులుకోం. మేం మిమ్మల్ని గౌరవిస్తాం, మమ్మల్ని గౌరవించకపోతే ఎలా గౌరవించాలో కూడా నేర్పుతాం’’ అని తేల్చిచెప్పారు. సీనియర్‌ సంపాదకులు, ప్రఖ్యాత రచయిత డా.కె.శ్రీనివాస్‌ ఈ సదస్సులో కీలకోపన్యాసం చేశారు. భారతదేశంలో భాష కేవలం ఒక గుర్తింపుగా కాకుండా రాజకీయ మౌలిక సదుపాయంగా పనిచేస్తుందని, అది విద్య, అధికారాన్ని అందుకోవడానికి బాటలు వేస్తుందని అన్నారు. అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. ‘‘ఉత్తర భారతానికి మేం వ్యతిరేకం కాదు. దక్షిణాది రాష్ట్రాల భాషపైన, సాంస్కృతికత, ప్రజల జీవన విధానాలపై జరుగుతున్న దాడిని, నిధుల కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తాం’’ అని పేర్కొన్నారు. దక్షిణాది భాషల పరిరక్షణ, మాతృభాషకు గౌరవం వచ్చేలా మరిన్ని సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Updated Date - Dec 20 , 2025 | 04:36 AM