Neha Singh Rathore: యూపీ గాయని నేహా రాథోడ్‌పై దేశద్రోహం కేసు
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:11 AM
ఉత్తరప్రదేశ్‌కు చెందిన గాయని నేహా సింగ్ రాథోడ్‌పై పహల్గాం విషాదానికి సంబంధించి దేహద్రోహం కేసు నమోదు చేశారు. నేహా ఈ కేసు పై స్పందిస్తూ, ప్రభుత్వం నిజమైన అంశాలను పరిగణించకుండా తనపై చర్యలు తీసుకున్నదని ఆరోపించింది.
లఖ్‌నవూ, ఏప్రిల్ 28: ఉత్తరప్రదేశ్‌కు చెందిన జానపద గాయని నేహా సింగ్ రాథోడ్‌పై పోలీసులు దేహద్రోహం కేసు నమోదు చేశారు. పహల్గాం విషాదం నేపథ్యంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లు రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఇవి దేశ సమగ్రతకు హాని కలిగిస్తాయంటూ అభయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. దీనిపై నేహా స్పందించారు. తనపై కేసు నమోదు చేసిన ప్రభుత్వం వాస్తవ అంశాల నుంచి దృష్టి మళ్లించాలనుకుంటోందన్నారు. ‘‘పహల్గాం దాడికి ప్రతిస్పందనగా ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేసింది? నాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడమా? మీకు ధైర్యం ఉంటే వెళ్లి ఉగ్రవాదుల తలలు తీసుకురండి’’ అని పేర్కొంటూ ఆమె ఎక్స్‌లో సోమవారం ఓ వీడియో షేర్ చేశారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..
Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం
For National News And Telugu News