PM Modi Urges: సర్‌పై రచ్చ వద్దు.. అసెంబ్లీ పైనే దృష్టి
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:02 AM
ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్) చాలా సాధారణ అంశమని.. అనవసర రచ్చ చేసి వివాదాస్పదంగా మార్చవద్దని పశ్చిమబెంగాల్...
బెంగాల్ బీజేపీ ఎంపీలకు మోదీ దిశానిర్దేశం
న్యూఢిల్లీ, డిసెంబరు 3: ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్) చాలా సాధారణ అంశమని.. అనవసర రచ్చ చేసి వివాదాస్పదంగా మార్చవద్దని పశ్చిమబెంగాల్ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మొదట్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో బుధవారం ఆయన పార్లమెంటు ప్రాంగణంలో ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శామిక్ భట్టాచార్య, కేంద్ర మంత్రులు శంతను ఠాకూర్, సుకాంత మజుందార్‌లతో సమావేశమయ్యారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. అంతా నియోజకవర్గాల్లో ఉండి పార్టీ వ్యూహాలను పక్కాగా అమలు చేయడంపై దృష్టిపెట్టాలని చెప్పారు.