PM Modi Labels Congress Dead Party: కాంగ్రెస్ ఇక ముక్కలే
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:35 AM
కాంగ్రెస్ పార్టీ పరాన్న జీవిగా మారిందని, త్వరలో ముక్కలు కాబోతోందని ప్రధాని మోదీ చెప్పారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించడంతో...
కాంగ్రెస్ పరాన్నజీవి పార్టీగా మారింది
బిహార్ విజయోత్సవ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, నవంబరు 14: కాంగ్రెస్ పార్టీ పరాన్న జీవిగా మారిందని, త్వరలో ముక్కలు కాబోతోందని ప్రధాని మోదీ చెప్పారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించడంతో ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలీగ్-మావోయిస్ట్ కాంగ్రె్‌సలా మారిందన్నారు. కాంగ్రెస్ నకరాత్మక అజెండాతో ఆ పార్టీతో జతకట్టిన పార్టీలన్నింటినీ ముంచుతోందని, జాగ్రత్తగా ఉండాలని ఆయా పార్టీల నేతలకు సూచించారు. కాంగ్రెస్ నేతలే ఆ పార్టీ అధిష్టాన విధానాలను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ త్వరలో మరోసారి ముక్కలు కాబోతుందన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన 3లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం మూడంకెల సీట్లను సాధించలేకపోయిందని మోదీ ఎద్దేవా చేశారు. తుష్టీకరణ రాజకీయలను, అబద్ధాలను తిరస్కరించి బిహార్ ఓటర్లు సుపరిపాలనకు పట్టం కట్టారని చెప్పారు. విపక్షాల ఎంవై(ముస్లిం-యాదవ్) సూత్రం మతపరమైనదని, అయితే ఎన్డీయే ఎంవై ఫార్ములా సామాజిక సంక్షేమం, న్యాయాన్ని సాధించేదన్నారు. తాజా విజయంతో బిహార్ మహిళలు, యువత ఎన్డీయేకు కొత్త ఫార్ములా ఇచ్చారని మో దీ చెప్పారు. బిహార్‌లో ఇక ఎప్పటికీ జంగిల్‌రాజ్ ప్రభుత్వం తిరిగి రాదన్నారు. ఈ విజయం పశ్చిమబెంగాల్‌లో బీజేపీ విజయానికి మార్గం సుగమం చేసిందన్న ప్రధాని.. బెంగాల్‌లో జంగిల్‌రాజ్‌ను తొలగిస్తామన్నారు.