Share News

PM Modi Announces Flood Relief Fund: హిమాచల్‌కు రూ.1500 కోట్ల తక్షణ సాయం

ABN , Publish Date - Sep 10 , 2025 | 03:36 AM

భారీవర్షాలు, వరదలతో అతలాకుతలమైన హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ మంగళవారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. హిమాచల్‌కు రూ.1,500 కోట్ల తక్షణ సాయం, పంజాబ్‌కు...

PM Modi Announces Flood Relief Fund: హిమాచల్‌కు రూ.1500 కోట్ల తక్షణ సాయం

  • పంజాబ్‌కు రూ.1600 కోట్లు..ప్రకటించిన ప్రధాని మోదీ

సిమ్లా, ధర్మశాల, చండీగఢ్‌, న్యూఢిల్లీ, సెప్టెంబరు 9 : భారీవర్షాలు, వరదలతో అతలాకుతలమైన హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ మంగళవారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. హిమాచల్‌కు రూ.1,500 కోట్ల తక్షణ సాయం, పంజాబ్‌కు రూ.1,600 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇప్పటికే పంజాబ్‌ విపత్తు సహాయ నిధిలో రూ.12,000 కోట్లు ఉండగా వాటికి అదనంగా ఈ సహాయాన్ని ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో వరదల్లో మరణించిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల సాయం ప్రకటించారు. కాగా హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రాలో సహాయ, పునరావాస చర్యలపై ప్రధాని సమీక్షించారు. పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. అనంతరం ప్రధాని వరద బాధితులను పరామర్శించారు. అలాగే వరదలతో సతమతమవుతోన్న పంజాబ్‌ రాష్ట్రంలో తీవ్రంగా ప్రభావితమైన గురుదా్‌సపూర్‌ జిల్లాలో పర్యటించారు. దశాబ్దాలుగా ఎన్నడూ లేని స్థాయిలో వచ్చిన వరదలను పంజాబ్‌ ఎదుర్కొంటోంది. ఈ కారణంగా 52 మంది మరణించారు. 1.91 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. కాగా ప్రధాని వరద సహాయ నిధికి సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, ఇతర జడ్జిలు రూ.25,000 చొప్పున విరాళం ఇవ్వనున్నారు.

Updated Date - Sep 10 , 2025 | 03:36 AM