Share News

PM Modi about Yoga Day: యోగా ప్రపంచ ఐక్యతా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది: ప్రధాని మోదీ

ABN , Publish Date - Jun 17 , 2025 | 07:19 PM

యోగా అనేది కేవలం వ్యక్తిగత ఆరోగ్యం గురించి మాత్రమే కాదని, మానవత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ ఐక్యతా స్ఫూర్తిని నెలకొల్పడానికి కూడా తోడ్పడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు.

PM Modi about Yoga Day: యోగా ప్రపంచ ఐక్యతా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది: ప్రధాని మోదీ
PM Modi

యోగా అనేది కేవలం వ్యక్తిగత ఆరోగ్యం గురించి మాత్రమే కాకుండా, మానవత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ ఐక్యతా స్ఫూర్తిని నెలకొల్పడానికి కూడా తోడ్పడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ మేరకు యోగా దినోత్సవ సందేశంతో కూడిన లేఖను ప్రధాని విడుదల చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.


'చారిత్రాత్మక యోగా ప్రస్థానం విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత వైభవంగా నిర్వహించుకోబోతున్నాం. గత పదేళ్లుగా యోగా కేవలం భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ చేరువై వారి జీవితాల్లో సానుకూల ప్రభావం చూపుతోంది. అది మనందరికీ గర్వకారణం. ఈ ఏడాది విశాఖపట్నం కేంద్రంగా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 'యోగా.. ఒక భూమి.. ఒక ఆరోగ్యం..' అనే థీమ్‌తో జరుపుకోబోతున్నాం' అని ప్రధాని పేర్కొన్నారు.


'యోగా మన సంస్కృతిలో ఒక అంతర్భాగం. ఇది శరీరం, మనసు మధ్య సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుంది. శారీరకంగా, మానసికంగా స్వావలంబన పొందిన పౌరులు దేశ నిర్మాణంలో మరింత కీలక పాత్ర పోషించగలరు. దేశవ్యాప్తంగా ప్రతి పంచాయతీ పరిధిలో జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో వీలనంత ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయాల'ని ప్రధాని మోదీ అకాంక్షించారు.


ఇవి కూడా చదవండి..

Air India Plane crash: ఎయిరిండియా విమానం కూలే ముందు రాట్ తెరుచుకుందా.. దాని ప్రాధాన్యం ఏంటి?

ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకున్న 100 మంది భారతీయ విద్యార్థులు

For More National News

Updated Date - Jun 17 , 2025 | 07:19 PM