Share News

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ వేళ ప్రధాని మోదీ, ఆర్మీ చీఫ్‌ మధ్య విభేదాలు!

ABN , Publish Date - Sep 10 , 2025 | 03:56 AM

భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికలపైనే అబద్ధాలు ప్రచారం చేసే అలవాటున్న పాకిస్థాన్‌.. ఇప్పుడు ఆపరేషన్‌ సిందూర్‌’పై ఇంటర్‌నెట్‌..

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ వేళ ప్రధాని మోదీ, ఆర్మీ చీఫ్‌ మధ్య విభేదాలు!

  • దాయాది దేశం పాకిస్థాన్‌ దుష్ప్రచారం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికలపైనే అబద్ధాలు ప్రచారం చేసే అలవాటున్న పాకిస్థాన్‌.. ఇప్పుడు ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై ఇంటర్‌నెట్‌ వేదికగా ఫేక్‌ ప్రచారం చేస్తోంది. ఆ ఆపరేషన్‌ చేపట్టినప్పుడు భారత ప్రధాని మోదీకి- ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీకి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయని.. మనవద్ద ఉన్న ఆయుధ వ్యవస్థలను పెద్ద ఎత్తున ఆధునికీకరించనిదే సైన్యం యుద్ధం చేయబోదంటూ ద్వివేదీ మోదీకి చెప్పారని.. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తోంది. ఈ ఫేక్‌ ప్రచారాన్ని ‘ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో నిజనిర్ధారణ విభాగం’ తీవ్రంగా ఖండించింది. ‘‘భారత ప్రధాని మోదీకి- ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేదీకి మధ్య విభేదాలు నెలకొన్నట్టు పాకిస్థాన్‌కు చెందిన కొన్ని (ఎక్స్‌) ఖాతాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి. ఆ ఆరోపణలు అసత్యం’’ అని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ యూనిట్‌ పేర్కొంది.

Updated Date - Sep 10 , 2025 | 03:56 AM