Share News

Parliament Winter Session: డిసెంబరు 1నుంచి పార్లమెంటు సమావేశాలు

ABN , Publish Date - Nov 09 , 2025 | 01:15 AM

పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 1 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు ఈ విషయాన్ని...

Parliament Winter Session: డిసెంబరు 1నుంచి పార్లమెంటు సమావేశాలు

న్యూఢిల్లీ, నవంబరు 8: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 1 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు ఈ విషయాన్ని శనివారం ప్రకటించారు. మూడు వారాల పాటు జరగనున్న ఈ సెషన్‌లో ఉభయ సభలు 15రోజులు మాత్రమే సమావేశం(సిట్టింగ్స్‌) కానున్నాయి. దీనిపై విపక్షాలు విమర్శలు వ్యక్తం చేశాయి. పార్లమెంటు సమావేశాలను ఆలస్యంగా నిర్వహించడమే కాకుండా, వ్యవధిని కుదించడంలో కేంద్రప్రభుత్వం ఉద్దేశం ఏంటని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. ఎన్నికల సంఘం 12 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎ్‌సఐఆర్‌) చేపట్టిన నేపథ్యంలో ఈ సమావేశాలు జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ జరిగిన సమయంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగాయి. అప్పుడు ఈ ఎస్‌ఐఆర్‌ అంశం సమావేశాలను స్తంభింపజేసిన సంగతి తెలిసిందే.

Updated Date - Nov 09 , 2025 | 01:15 AM