Share News

Parliament Winter Session: సర్‌పైనే సమరం

ABN , Publish Date - Nov 30 , 2025 | 05:14 AM

చల్లచల్లని శీతాకాలంలో అధికార, విపక్షాల మధ్య వాడివేడిగా చర్చలకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.

Parliament Winter Session: సర్‌పైనే సమరం

  • రేపటి నుంచి డిసెంబరు 19వ తేదీ వరకుపార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

  • నేడు అఖిలపక్ష, బీఏసీ భేటీలు

న్యూఢిల్లీ, నవంబరు 29: చల్లచల్లని శీతాకాలంలో అధికార, విపక్షాల మధ్య వాడివేడిగా చర్చలకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్రం ఆదివారం ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని పార్టీలకు విజ్ఞప్తి చేయనుంది. పార్లమెంటు సమావేశాల్లో చర్చించే అంశాల ఎజెండాను ఖరారు చేసేందుకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు విడివిడిగా లోక్‌సభ, రాజ్యసభల బీఏసీ సమావేశాలు జరగనున్నాయి. డిసెంబర్‌ 19వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్‌) అంశం కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంటులో చర్చకు పట్టుబట్టాల్సిన అంశాలపై చర్చించుకునేందుకు ఇండి కూటమి పార్టీల ప్రతినిధులు సోమవారం ఉదయం 10 గంటలకు రాజ్యసభ ప్రాంగణంలోని ఖర్గే కార్యాలయంలో భేటీ కానున్నారు.

Updated Date - Nov 30 , 2025 | 05:14 AM