Pan Masala Barons: కమలా పసంద్ ఓనర్ ఇంట్లో తీవ్ర విషాదం.. కోడలు ఆత్మహత్య..
ABN , Publish Date - Nov 26 , 2025 | 02:43 PM
కమలా పసంద్ యజమాని కమల్ కిషోర్ చౌరాసియా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కిషోర్ చౌరాసియా కోడలు దీప్తీ చౌరీసియా ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ, వసంత్ విహార్‌లోని ఇంట్లో ఆమె దుపట్టాతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
న్యూఢిల్లీ: ప్రముఖ పాన్ మసాల బ్రాండ్ కమలా పసంద్ యజమాని కమల్ కిషోర్ చౌరాసియా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కమల్ కిషోర్ చౌరాసియా కోడలు దీప్తీ చౌరీసియా ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఢిల్లీ, వసంత్ విహార్‌లోని ఇంట్లో దీప్తీ దుపట్టాతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె గదిలో పోలీసులకు ఓ సూసైడ్ నోట్ దొరికింది. ఆ నోట్‌లో.. ‘ఓ బంధంలో ప్రేమ, నమ్మకం లేకపోతే, ఇక బతికి ఉండి లాభం ఏంటి?’ అని రాసి ఉన్నట్లు సమాచారం.
కుటుంబ కలహాల కారణంగా ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీప్తీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత దీప్తీ మరణానికి కారణం ఏంటో తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, కమల్ కిషోర్ చౌరీసియా కుమారుడు అర్పిత్ చౌరాసియాకు దీప్తీకి 2010లో పెళ్లయింది. వీరికి 14 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.
దేశ వ్యాప్తంగా పేరున్న బ్రాండ్..
కమలా పసంద్ పాన్ మసాలాను కేపీ గ్రూప్, కమలా కాంత్ కంపెనీ సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. కమల్ కాంత్ చౌరాసియాతో పాటు కమల్ కిషోర్ చౌరాసియాలు ఈ కంపెనీలకు యజమానులుగా ఉన్నారు. కాన్పూర్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలలో కమలా పసంద్ బిజినెస్ విస్తరించి ఉంది. కమలా పసంద్ దేశ వ్యాప్తంగా అమ్ముడవుతోంది. కమల్ కాంత్ చౌరాసియా 45 ఏళ్ల క్రితం కాన్పూర్‌లోని ఫీల్డ్‌ఖానాలో గుట్కా బిజినెస్‌ను మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ బిజినెస్ కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.
ఇవి కూడా చదవండి
బర్త్ డే పార్టీ పేరుతో పిలిచి.. యువకుడిపై పెట్రోల్ పోసి..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 888ల మధ్య 808 ఎక్కడుందో 8 సెకెన్లలో కనిపెట్టండి..