Shehbaz Sharif: షాంఘై సదస్సులో పాక్ ప్రధానికి పరాభావం!
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:24 AM
ఎస్సీవో సదస్సు సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్‌కు పరాభవం ఎదురైంది. ఆయనను సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న చైనా అధ్యక్షుడు ీజిన్‌పింగ్ సహా భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు పట్టించుకోలేదు.
తియాన్‌జిన్, సెప్టెంబరు 1: ఎస్సీవో సదస్సు సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్‌కు పరాభవం ఎదురైంది. ఆయనను సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న చైనా అధ్యక్షుడు ీజిన్‌పింగ్ సహా భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు పట్టించుకోలేదు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మోదీ, జిన్‌పింగ్, పుతిన్ కరచాలనాలు చేసుకుంటూ.. సరదాగా మాట్లాడుకుంటూ.. చిరునవ్వులు చిందిస్తూ కనిపించగా.. హెహబాజ్ ఒంటరిగా ఉండిపోయారు. సదస్సు వేదిక వద్దకు కలిసి వచ్చిన మోదీ, పుతిన్‌కు జిన్‌పింగ్ స్వాగతం పలికారు. సదస్సుకు హాజరైన వివిధ దేశాధినేతలు వేచి చూస్తుండగా మోదీ, పుతిన్, జిన్‌పింగ్ పలకరింపుల తర్వాత మాటల్లో పడిపోయారు.
వారి ముచ్చట్లు, నవ్వుల్లో రెండు నిమిషాలు దొర్లిపోయాయి. తర్వాత మోదీ, పుతిన్ నడిచి వెళుతుండగా మధ్యలో షెహబాజ్ నిల్చుని ఉన్నప్పటికీ వారు పట్టించుకోకుండా మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోయారు. పహల్గాం ఉగ్ర దాడి, దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టి ఆపరేషన్ సిందూర్ తర్వాత మోదీ, షెహబాజ్ ఎదురుపడడం ఇదే తొలిసారి.