India deportation: రేషన్ కార్డు ఇక్కడే ఉంది.. ఓటూ వేస్తున్నాను
ABN , Publish Date - May 01 , 2025 | 05:06 AM
17 ఏళ్లుగా భారత్‌లో నివసిస్తున్న పాక్ జాతీయుడు ఉస్మాన్ తనకు ఇక్కడ రేషన్ కార్డు, ఓటు హక్కు, చదువులన్నీ ఉన్నాయంటూ, పాకిస్థాన్‌కి వెళ్లి ఏం చేయాలనేది ప్రశ్నించాడు. పాక్ జాతీయులను వెనక్కి పంపించే నిర్ణయంపై కేంద్రం పునరాలోచన చేయాలని ఆయన కోరాడు.
ఇప్పుడు పాక్ వెళ్లి ఏం చేయాలి.. పాక్ జాతీయుడి ఆవేదన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: పాకిస్థానీలు ఎవ్వరున్నా భారత్‌ను వీడి పోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఇక్కడ ఉంటున్న ఆ దేశస్తులు సరిహద్దు దాటుతున్న నేపథ్యంలో ఓ పాకిస్థానీయుడు.. ‘‘నేను పాక్‌కు వెళ్లి ఏం చేయాలి?’’ అని ప్రశ్నిస్తున్నాడు. దీనికన్నా, అతడు చెప్పిన మిగతా విషయాలే అధికారులను షాక్‌కు గురిచేస్తున్నాయి! ఆ పాక్ జాతీయుడి పేరు ఉస్మాన్! తాను భారత్‌లో 17 ఏళ్లుగా ఉంటున్నానని.. తనకు రేషన్ కార్డు కూడా ఉందని, ఎన్నికలోచ్చినప్పుడుల్లా ఓటు కూడా వేస్తున్నానని చెబుతున్నాడు. ‘‘నేను భారత్‌లోనే పదో తరగతి, ఇంటర్ పూర్తి చేశాను. ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను. చదువు పూర్తయ్యాక ఏదైనా ఉద్యోగం సంపాదించేందుకు ఇంటర్వ్యూలకూ వెళ్లాలనే ప్రణాళికతో ఉన్నాను. ఇప్పుడు పాకిస్థాన్‌కు వెళ్లి నేను ఏం చేయాలి? నాకు అక్కడ భవిష్యత్తు ఉంటుందా?’’ అని ఉస్మాన్ చెప్పుకొచ్చాడు. పాక్ జాతీయులను తిప్పిపంపే ఆలోచనపై భారత ప్రభుత్వం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశాడు.
Also Read:
BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..