Border Security: 287 మంది పాక్‌కు.. 191 మంది భారత్‌కు
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:22 AM
పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు 287 మంది పాక్ జాతీయులు భారత్ విడిచి వెళ్లారు. పాక్ పౌరులతో వివాహం చేసుకున్న భారతీయ మహిళలకు సరిహద్దు దాటేందుకు అనుమతి ఇవ్వలేదు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్‌లోని పాక్ జాతీయులు 48 గంటల్లో దేశం వదిలి వెళ్లాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 287 మంది పాక్ జాతీయులు దేశం వీడి వెళ్లారని అధికారులు తెలిపారు. అదేసమయంలో 191 మంది భారతీయ పౌరులు కూడా పాక్ నుంచి తిరిగి వచ్చారు. ఇక, పాక్ జాతీయులను వివాహం చేసుకున్న పలువురు మహిళలు.. అట్టారి-వాఘా సరిహద్దు దాటేందుకు ప్రయత్నించగా వారిని సరిహద్దు భద్రత అధికారులు అనుమతించలేదు. వీరికి భారత పాస్‌పోర్టులు ఉండడంతో.. సరిహద్దు దాటనివ్వలేదు. దీంతో ఆయా మహిళలు వారి కుటుంబాల్లోని పాక్ జాతీయత ఉన్న వ్యక్తులను మాత్రమే ఆ దేశానికి పంపించారు.
ఇవి కూడా చదవండి:
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్