Share News

Asim Munir: పాక్‌ సైన్యంలో తిరుగుబాటు

ABN , Publish Date - May 01 , 2025 | 05:31 AM

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ యుద్ధానికి దిగుతుందని పాక్‌ సైన్యం, పాలకులు భయపడుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. సైనికులు, అధికారులే తిరుగుబాటు చేసి, యుద్ధభయంతో 4,500 మంది సైనికులు, 250 మంది సైన్యాధికారులు పాక్‌ సైన్యాన్ని వదిలిపెట్టారని సమాచారం.

Asim Munir: పాక్‌ సైన్యంలో తిరుగుబాటు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్‌ యుద్ధానికి దిగుతుందని పాకిస్థాన్‌ పాలకులే కాదు.. సైన్యం కూడా భయపడుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కొందరు సైనికులు, సైన్యాధికారులు తిరుగుబాటు చేయగా.. పలువురు ఏకంగా ఆర్మీకే గుడ్‌బై చెప్పేశారని ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ పత్రిక తాజాగా కథనం ప్రచురించింది. అన్నిటి కంటే ముఖ్యంగా.. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసీం మునీర్‌ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతున్నట్లు వెల్లడించింది. ఆయన పాక్‌ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ రావల్పిండిలో బంకర్లో దాక్కుని ఉన్నారని పాక్‌ ప్రభుత్వంలో కొందరు అధికారులు చెబుతుండగా.. కుటుంబంతో కలిసి విదేశాలకు పరారయ్యారని సోషల్‌ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే, పాక్‌ దీన్ని కొట్టిపారేసింది. యుద్ధభయంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే 4,500 మంది సైనికులు, 250 మంది సైన్యాధికారులు పాక్‌ సైన్యానికి గుడ్‌బై చెప్పేశారని ‘ది డైలీ గార్డియన్‌’ పత్రిక తెలిపింది.


ఇంకొన్ని వేల మంది ఉద్యోగాలకు రాజీనామా దరఖాస్తులు సమర్పించారు. దీంతో ఆర్మీ చీఫ్‌ మునీర్‌ షాకైనట్లు తెలిసింది. సైన్యంలో ధైర్య స్థైర్యాలు నింపేందుకు ఇంటర్‌-సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (ఐఎ్‌సపీఆర్‌) డీజీ మేజర్‌ జనరల్‌ ఫైసల్‌ మెహమూద్‌ మాలిక్‌ను రంగంలోకి దించారు. ఆయన అన్ని ర్యాంకుల సాయుధ బలగాలనుద్దేశించి ఏప్రిల్‌ 26న రాసిన రహస్య లేఖ వెలుగులోకి వచ్చింది. మనోబలం కోల్పోవద్దని.. దేశానికి విశ్వాసపాత్రులుగా ఉండాలని మాలిక్‌ అందులో కోరారు.


Also Read:

BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్‌ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ

Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..

Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..

Updated Date - May 01 , 2025 | 05:31 AM