Pakistan Hindus: ఆ నరకానికి మళ్లీ వెళ్లం
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:32 AM
భారతదేశంలో ఆశ్రయం పొందిన పాకిస్థాన్ హిందువులు తమను మళ్లీ నరకం లాంటి పాక్‌కు పంపవద్దని కేంద్రాన్ని వేడుకుంటున్నారు. పహల్గాం దాడి నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
హిందూ శరణార్థుల వేడుకోలు
జైసల్మేర్, ఏప్రిల్ 26 : ఇక్కడ చావడానికైనా సిద్ధమే.. కానీ నరకం లాంటి పాకిస్థాన్‌కు మాత్రం మళ్లీ వెళ్లం, దయ చూపండి.. భారతదేశంలో శరణార్థులుగా ఆశ్రయం పొందిన పాకిస్థాన్ హిందువులు ప్రభుత్వానికి చేసుకుంటున్న వేడుకోలు ఇది. పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్థాన్ పౌరులంతా 27వ తేదీలోగా భారతదేశం వదిలి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల శరణార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాకిస్థాన్‌లో వేధింపులు భరించలేక, ఉన్నదంతా అమ్ముకొని, అన్నీ వదులుకుని భారత్‌కు వచ్చామని, తిరిగి ఆ నరకానికి వెళ్లలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ముల్సాగర్ అనే గ్రామంలో స్వల్పకాలిక వీసా కలిగిన పాక్ హిందువులు వెయ్యి మందికిపైగా ఉన్నారు. ప్రధాని మోదీ, భారత ప్రభుత్వం తమపై దయ చూపాలని వారంతా వేడుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్