India Pakistan water dispute: చీనాబ్ నదీ జలాల విడుదల
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:01 AM
భారత్ చీనాబ్ నది నుంచి ముందస్తు సమాచారం లేకుండానే నీటిని వదిలిందని పాకిస్థాన్ ఆరోపించింది. సింధు నది ఒప్పందం నిలిపివేత నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదురుతోంది.
పాకిస్థాన్ ముజఫరాబాద్‌లో ఎమర్జెన్సీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా భారత్ శనివారం సాయంత్రం చీనాబ్ నది నుంచి నీటిని వదిలిందని పాకిస్థాన్ ఆరోపించింది. నదీ పరీవాహకాల్లో భారీ వరద వచ్చిందని పాకిస్థానీ పత్రిక ‘డాన్’ పేర్కొంది. సుమారు 22 వేల క్యూసెక్కుల నీటిని భారత్ వదిలిందని వివరించింది. కాగా.. 1960 నాటి సింధు నది ఒప్పందంలో భాగంగా నీటిని దిగువకు వదిలినప్పుడు పాకిస్థాన్‌కు భారత్ సమాచారం అందించాలి. తాజాగా భారత్ ఆ ఒప్పందాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే..!
ఇవి కూడా చదవండి:
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్