Asaduddin Owaisi : ముగ్గురు పిల్లలతో భారత మహిళపై భారం
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:03 AM
కుటుంబంలో ముగ్గురు పిల్లల పేరుతో భారతీయ మహిళలపై భారం పెంచొద్దని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ముగ్గురు పిల్లలుంటే ఆ కుటుంబంలోని పిల్లల మధ్య...
మోహన్ భాగవత్‌పై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ధ్వజం
హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): కుటుంబంలో ముగ్గురు పిల్లల పేరుతో భారతీయ మహిళలపై భారం పెంచొద్దని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ముగ్గురు పిల్లలుంటే ఆ కుటుంబంలోని పిల్లల మధ్య సాన్నిహిత్య సంబంధాలు ధృడమవుతాయన్న ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యల్లో ద్వందార్థాలున్నాయని శుక్రవారం దారుసలాంలో మీడియాతో అన్నారు. ముగ్గురు పిల్లలను కనాలని భారతీయ మహిళలపై భారం మోపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారని మోహన్ భాగవత్‌ను ప్రశ్నించారు. ప్రధాని మోదీ హయాంలో దేశంలోని ముస్లింలపై శత్రుత్వం సుస్థిరమైందని మండిపడ్డారు. ఆర్‌ఎ్‌సఎస్, దానికి మద్దతుగా నిలిచిన మితవాద సంస్థలు నిరంతరం మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని జనాభా పెరుగుదలపై తప్పుడు సమాచారంతో విమర్శలు చేస్తుంటాయని, కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నమని చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువులు 80ు కాగా, ముస్లింలు కేవలం 14.23 శాతమని స్పష్టం చేశారు. ఏది ఏమైనా ప్రజల వ్యక్తిగత, కుటుంబ జీవితంపై మాట్లాడేందుకు మీరెవరని భాగవత్‌ను ప్రశ్నించారు.