Asaduddin Owaisi: సీజేఐ పైకి బూటు విసిరింది అసద్ అయితే..?
ABN , Publish Date - Oct 09 , 2025 | 02:43 AM
సీజేఐపై బూటు విసిరిన ఘటనపై మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు మతం రంగు పులుముతూ బీజేపీని ప్రశ్నించారు....
కేసు పెట్టకుండా ఊరుకునేవారా?: ఒవైసీ
న్యూఢిల్లీ, అక్టోబరు 8: సీజేఐపై బూటు విసిరిన ఘటనపై మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు మతం రంగు పులుముతూ బీజేపీని ప్రశ్నించారు. నిందితుడు రాకేశ్ కిశోర్‌పై కేసు నమోదు చేయకుండా కేంద్రం పక్షపాతం చూపిందని విమర్శించారు. సుప్రీంకోర్టుకు రెండో దళిత ప్రధాన న్యాయమూర్తి అయిన గవాయ్‌పై బూటు విసిరిన వ్యక్తి మీద కేసెందుకు పెట్టలేదని ఒవైసీ ఎక్స్‌లో ప్రశ్నించారు. ‘‘బూటు విసిరిన వ్యక్తి పేరు రాకేశ్ కిశోర్ కాకుండా అసద్ అయి ఉంటే? పోలీసులు, బీజేపీ నేతలు ఏం చేసేవారు? వెంటనే అతన్ని అరెస్టు చేయండి. పొరుగు దేశంతో, ఐఎ్‌సఐతో ఉన్న సంబంధాలను వెలికితీయమని చెప్పేవారు. మోదీజీ మీరే చెప్పండి. నిందితుడిపై చర్యలు తీసుకునే బాధ్యత మీ ప్రభుత్వానికి లేదా?’’ అని ఒవైసీ పేర్కొన్నారు.