Share News

V Narayanan: సిందూర్‌లో 400 మంది ఇస్రో శాస్త్రవేత్తలు

ABN , Publish Date - Sep 10 , 2025 | 03:58 AM

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో 400 మందికిపైగా ఇస్రో శాస్త్రవేత్తలు 24 గంటలూ పనిచేశారని, ఎర్త్‌ అబ్జర్వేషన్‌..

V Narayanan: సిందూర్‌లో 400 మంది ఇస్రో శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో 400 మందికిపైగా ఇస్రో శాస్త్రవేత్తలు 24 గంటలూ పనిచేశారని, ఎర్త్‌ అబ్జర్వేషన్‌, కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల ద్వారా మన సైన్యానికి తగిన సహకారం అందించారని ఇస్రో చైర్మన్‌ వి.నారాయణన్‌ వెల్లడించారు. జాతీయ భద్రత అవసరాల మేరకు తమ సంస్థ ఉపగ్రహ సమాచారాన్ని అందించిందన్నారు. మంగళవారం ఢిల్లీలో ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ ‘ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో అన్ని అవసరాలూ తీరుస్తూ ఉపగ్రహాలన్నీ 24/7 పర్ఫెక్ట్‌గా పనిచేశాయి. 400 మందికిపైగా శాస్త్రవేత్తలు 24/7 పనిచేస్తూ.. ఎర్త్‌ అబ్జర్వేషన్‌, కమ్యూనికేషన్‌ కోసం అన్ని ఉపగ్రహాలనూ పూర్తి సమయం వినియోగించారు’ అని తెలిపారు.

Updated Date - Sep 10 , 2025 | 03:58 AM