Share News

Ladki Bahin Scheme: ఎంతకు తెగించార్రా.. ఆడాళ్ల స్కీమ్‌లో మగాళ్లు..

ABN , Publish Date - Jul 27 , 2025 | 03:07 PM

Ladki Bahin Scheme: ఆడవాళ్ల కోసం ప్రవేశపెట్టిన ఈ స్కీముకు మగాళ్లు కూడా అప్లై చేసుకున్నారు. ఫేక్ ఐడీలు సృష్టించి పథకానికి అర్హత పొందారు. దాదాపు 14,298 మంది మగాళ్లు ఫేక్ గుర్తింపుతో ఈ పథకం కింద ఆర్థికసాయం పొందారు.

Ladki Bahin Scheme: ఎంతకు తెగించార్రా.. ఆడాళ్ల స్కీమ్‌లో మగాళ్లు..
Ladki Bahin Scheme

తక్కువ ఆదాయం కలిగిన ఆడవాళ్లను ఆర్థికంగా ఆదుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ‘లడ్కీ బెహన్ యోజన’ స్కీమ్ ప్రవేశపెట్టింది. అర్హులైన ఆడవాళ్లకు నెలకు 1500 రూపాయలు అందిస్తోంది. 21 నుంచి 65 సంవత్సరాల వయసు కలిగిన వారికి ఆర్థికసాయం చేస్తోంది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి అధికారంలోకి రావడానికి ఈ పథకం కూడా ఓ కారణం. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం కారణంగా ప్రభుత్వం విమర్శల పాలు అవుతోంది. ప్రభుత్వం మీద ఏకంగా భారీగా ఆర్థిక భారం పడుతోంది.


లడ్కీ బెహన్ యోజన కింద ప్రభుత్వం 24.1 మిలియన్ మంది అర్హులైన ఆడవారికి వారికి 3,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. గత సంవత్సరం 1,640 కోట్లు ఖర్చు అయ్యాయి. అయితే, 24.1 మిలియన్లలో ఐదు లక్షల మంది అనర్హుల్ని ప్రభుత్వం గుర్తించింది. అంతేకాదు.. సాధారణంగా ఇంట్లో ఒక మహిళ ఉంటే 1500 రూపాయలు వస్తాయి. అదే ఇద్దరు ఉంటే 3000 వేలు వస్తాయి. ఇలా ఎంత మంది ఉంటే అన్ని 1500 రూపాయలు వస్తాయి. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది ఆడవాళ్లు ఉండటం వల్ల అదనంగా 1,196 కోట్ల రూపాయలు ఖర్చయింది.


ఆడాళ్ల స్కీములో మగాళ్లు..

ఆడవాళ్ల కోసం ప్రవేశపెట్టిన ఈ స్కీముకు మగాళ్లు కూడా అప్లై చేసుకున్నారు. ఫేక్ ఐడీలు సృష్టించి పథకానికి అర్హత పొందారు. దాదాపు 14,298 మంది మగాళ్లు ఫేక్ గుర్తింపుతో ఈ పథకం కింద ఆర్థికసాయం పొందారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 10 నెలల పాటు ప్రతీ నెలా 1500 రూపాయలు పొందారు. వీరి కారణంగా ప్రభుత్వానికి 21.44 కోట్లు అదనంగా ఖర్చు అయింది. పది నెలల తర్వాత ‘ది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్’ ఆ 14 వేల మంది గుట్టురట్టయింది. వారిని పథకం నుంచి తొలగించారు.


ఇవి కూడా చదవండి

మైనర్లకూ పాన్ కార్డు ఇస్తారని తెలుసా.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

వెలుగు చూస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రాల అక్రమాలు..

Updated Date - Jul 27 , 2025 | 03:49 PM