ఎస్‌ఐఆర్‌ను తక్షణమే ఆపండి: ఇండీ కూటమి
ABN , Publish Date - Jul 28 , 2025 | 06:20 AM
బిహార్‌లో ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై ప్రతిపక్ష ఇండీ కూటమి విరుచుకుపడింది.
న్యూఢిల్లీ, జూలై 27: బిహార్‌లో ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై ప్రతిపక్ష ఇండీ కూటమి విరుచుకుపడింది. అస్పష్టత, లోపభూయిష్ట డేటాతో ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టారని మండిపడింది. మరణాలు, వలసలు ఇతర కారణాల వల్ల 63 లక్షలకు పైగా ఓటర్లు నిర్దేశిత చిరునామాలో లేరంటూ ఈసీ తేల్చిన డేటాను ప్రస్తావిస్తూ.. తక్షణమే ఈ ప్రక్రియను నిలిపేయాలంటూ డిమాండ్ చేసింది. ఈ సమస్య కేవలం ఇండీ కూటమి ఓటర్ల వరకే పరిమితం కాదని.. ఎన్డీయే మిత్రపక్షాలు కూడా ప్రభావితమవుతాయన్నది గుర్తుంచుకోవాలని పేర్కొంది. ఈ ప్రక్రియ ముగిసేనాటికి దాదాపు 2 కోట్ల మంది ఓటు హక్కును కోల్పోతారని హెచ్చరించింది.