President Murmu: ఆపరేషన్ సిందూర్ చరిత్రాత్మకం
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:28 AM
ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సిందూర్ చరిత్రాత్మక ఘటనగా నిలిచిపోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు..
సైనికుల వ్యూహాత్మక, సాంకేతిక సామర్థ్యమిది
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సిందూర్ చరిత్రాత్మక ఘటనగా నిలిచిపోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. పహల్గాం ఉగ్ర దాడికి నిర్ణయాత్మకంగా బదులిచ్చామని, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం దేశ ఐక్యతను చాటి చెప్పిందని వ్యాఖ్యానించారు. శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్న వేళ జాతిని ఉద్దేశించి గురువారం ఆమె ప్రసంగించారు. పహల్గాంలో అమాయక పౌరులను చంపడాన్ని అమానవీయ, పిరికిపంద చర్యగా అభివర్ణించారు. అవినీతి, వంచన ప్రజాస్వామ్య ఉత్పత్తులు కారాదని జాతిపిత మహాత్మ గాంధీ ఆశించారని, దేశం నుంచి అవినీతిని పారదోలాలన్న గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.