Operation Sindhu: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. నేపాల్, శ్రీలంక దేశాల పౌరులకు భారత్ సహాయం..
ABN , Publish Date - Jun 21 , 2025 | 01:16 PM
పశ్చిమాసియాలోని ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరుదేశాలు క్షిపణి దాడులకు పాల్పడుతున్నాయి. త్వరలోనే ఈ యుద్ధంలోకి అమెరికా కూడా ప్రవేశించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
పశ్చిమాసియాలోని ఇరాన్ (Iran), ఇజ్రాయెల్ (Israel) మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరుదేశాలు క్షిపణి దాడులకు పాల్పడుతున్నాయి. త్వరలోనే ఈ యుద్ధంలోకి అమెరికా కూడా ప్రవేశించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వ 'అపరేషన్ సింధు' (Operation Sindhu)ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మూసి ఉన్న తన గగనతలాన్ని భారతీయుల కోసం ఇరాన్ తెరిచింది.
మూడు విమానాల ద్వారా భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ప్రణాళికలు రచించింది. ఇప్పటికే చాలా మంది శుక్రవారం అర్ధరాత్రి, శనివారం తెల్లవారుజూమున ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా, ఇరాన్‌లో ఉన్న తమ పౌరులనూ వెనక్కి తీసుకొచ్చేందుకు సహకరించాల్సిందిగా నేపాల్ (Nepal), శ్రీలంక (SriLanka) ప్రభుత్వాలు భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. దీంతో ఆయా దేశాల పౌరులను కూడా ఇరాన్ నుంచి తీసుకొచ్చారు. కాగా, భారత్‌కు చెందిన విద్యార్థులు, యాత్రికులు, భక్తులు ఇరాన్‌లో ఉన్నారు. వారిని కేంద్ర ప్రభుత్వం క్షేమంగా వెనక్కి రప్పించింది.
ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం 'ఆపరేషన్ సింధు'ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారతీయులను తాము స్వంత మనుషులుగా భావిస్తామని, అందుకే వారి కోసం గగన తలాన్ని తెరిచామని 'ఆపరేషన్ సింధు'ను పర్యవేక్షిస్తున్న ఇరాన్ దౌత్యవేత్త జావద్ హుస్సేనీ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News