Share News

Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రికుల భద్రతకు ‘ఆపరేషన్‌ శివ’

ABN , Publish Date - Jun 05 , 2025 | 04:40 AM

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో వచ్చే నెలలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్‌ యాత్రను దృష్టిలో పెట్టుకుని యాత్రికుల భద్రత కోసం భారత భద్రతా బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రికుల భద్రతకు ‘ఆపరేషన్‌ శివ’

న్యూఢిల్లీ, జూన్‌ 4: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో వచ్చే నెలలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్‌ యాత్రను దృష్టిలో పెట్టుకుని యాత్రికుల భద్రత కోసం భారత భద్రతా బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఈ యాత్ర సజావుగా సాగేలా చూసేందుకుగాను భద్రతా బలగాలు ‘ఆపరేషన్‌ శివ’ను ప్రారంభించాయి. జూలై 3న ప్రారంభం కానున్న ఈ యాత్ర ఆగస్టు 9 వరకు 38 రోజుల పాటు సాగనుంది.


జూలై 3న మొదటి బ్యాచ్‌ యాత్రికులతో కూడిన బస్సులు శ్రీనగర్‌ నుంచి బయలుదేరుతాయి. మరోవైపు భద్రతా ఏర్పాట్లను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ షా సమీక్షించారు. 50వేలకు పైగా సైనికులను యాత్ర మార్గాలు, బేస్‌ క్యాంపులు, సున్నిత ప్రదేశాల్లో మోహరించారు. బాడీ స్కానర్లు, సీసీటీ వీ కెమెరాలు, 24/7 నిఘాతో కూడిన మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేయనున్నారు.

Updated Date - Jun 05 , 2025 | 04:40 AM