Operation Aaghat: ఢిల్లీలో ఆపరేషన్ ఆఘాత్
ABN , Publish Date - Dec 28 , 2025 | 06:37 AM
కొత్త సంవత్సర వేడుకల వేళ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు.
పెద్ద ఎత్తున ఆయుధాలు, డ్రగ్స్ స్వాధీనం
న్యూఢిల్లీ, డిసెంబరు 27: కొత్త సంవత్సర వేడుకల వేళ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. దక్షిణ ఢిల్లీ, ఆగ్నేయ ఢిల్లీ జిల్లాల్లో అర్థరాత్రి సమయంలో ఆపరేషన్ ఆఘాత్ 3.0 నిర్వహించి 660 మందిని అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున ఆయుధాలను, అక్రమ మద్యాన్ని, మాదక ద్రవ్యాలను, స్వాధీనం చేసుకున్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 24 దేశీయ పిస్తోళ్లు, 44 కత్తులు, 22,500 క్వార్టర్ల అక్రమ మద్యం, 231 వాహనాలను,350 దొంగిలించిన మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.