Mother Delivers Twins: రైలులో పాప.. ఆస్పత్రిలో బాబు
ABN , Publish Date - Sep 06 , 2025 | 05:09 AM
రైలు ప్రయాణంలో ఉన్న ఓ తల్లి.. ఒక బిడ్డను రైలులో, మరో బిడ్డను ఆస్పత్రిలో ప్రసవిం చింది. ఇచ్ఛాపురం స్టేషన్లో...
ప్రయాణంలోనే కవలలకు జన్మనిచ్చిన తల్లి
తొలుత రైల్వే డాక్టర్ చొరవతో ప్రసవం.. ఆస్పత్రికి తరలింపు
ఆముదాలవలస, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): రైలు ప్రయాణంలో ఉన్న ఓ తల్లి.. ఒక బిడ్డను రైలులో, మరో బిడ్డను ఆస్పత్రిలో ప్రసవిం చింది. ఇచ్ఛాపురం స్టేషన్లో జి.భూలక్ష్మి అనే గర్భిణి.. భర్త జానకిరాంతో కలిసి విశాఖ వెళ్లేందుకు కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్ బీ-2లో ఎక్కారు. మార్గమధ్యంలో ఆమెకు నొప్పులు రావడంతో ఆమదాలవలస రైల్వేస్టేషన్‌లోని ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రైలును స్టేషన్‌లో నిలపగా, రైల్వే డాక్టర్ కీర్తి వచ్చి గర్భిణి రైలులో ఉండగానే, ఆమె గర్భంలో ఇద్దరు బిడ్డలు ఉన్నట్లు నిర్ధారించి ప్రసవం చేశారు. ఒక శిశువు (ఆడబిడ్డ) జన్మించగా, మరో శిశువు ప్రసవం కష్టం కావడంతో రాగోలు జెమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలను ఐసీయూలో ఉంచినట్లు సమాచారం అందిందని ఆర్పీఎఫ్ ఎస్‌ఐ అరుణ తెలిపారు.