Share News

NEET Exam: నీట్‌పై అనుమానాస్పద అంశాలను.. తెలియజేసేందుకు ప్రత్యేక వెబ్‌సైట్లు

ABN , Publish Date - Apr 27 , 2025 | 01:09 AM

నీట్‌ ప్రవేశ పరీక్షకు సంబంధించి అనుమానాస్పద అంశాలను తెలియజేయటానికి ప్రత్యేక వెబ్‌సైట్లు ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ అధికారులు వెల్లడించారు. గత సంవత్సరం జరిగిన అక్రమాలు, లీకుల నేపథ్యంలో ఈ చర్య తీసుకోవాలని నిర్ణయించారు.

NEET Exam: నీట్‌పై అనుమానాస్పద అంశాలను.. తెలియజేసేందుకు ప్రత్యేక వెబ్‌సైట్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26 : వైద్య విద్య ప్రవేశ పరీక్ష(నీట్‌)కు సంబంధించి అనుమానాస్పద అంశాలను తెలియజేసేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌లను ఏర్పాటు చేసినట్లు జాతీయ పరీక్ష ఏజెన్సీ(ఎన్టీఏ) అఽధికారులు తెలిపారు. ఈ పరీక్ష రాసే అభ్యర్థులు తప్పుదోవ పట్టించే వ్యక్తుల మాటలు నమ్మవద్దని వారు సూచించారు. గత ఏడాది నీట్‌లో అక్రమాలు, లీకులు చోటు చేసుకున్నాయని పలు ఆరోపణలు రావడంతో ముందు జాగ్రత్తగా ఎన్టీయే ఈ చర్య తీసుకుంది. నీట్‌ అభ్యర్థులు తమ దృష్టికి వచ్చిన అనుమానాస్పద అంశాలను జ్ట్టిఞట://ుఽ్ట్చ.్చఛి.జీుఽ, జ్ట్టిఞట://ుఽ్ఛ్ఛ్ట.ుఽ్ట్చ.్చఛి.జీుఽ అనే వెబ్‌సైట్ల ద్వారా తెలియజేయవచ్చు. సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా లేదా అనధికారిక వెబ్‌సైట్ల ద్వారా నీట్‌ ప్రశ్నపత్రం అందిస్తామనే వారు లేదా ఈ పరీక్ష వివరాలు చెబుతామనే వారి వివరాలు తెలియజేయవచ్చు.


ఇవి కూడా చదవండి:

పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..

Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్

Updated Date - Apr 27 , 2025 | 01:09 AM