West Bengal voters: బెంగాల్‌లో 1.36 కోట్ల మంది ఓటర్లకు నోటీసులు
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:20 AM
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) సందర్భంగా.. ఒక కోటీ 36 లక్షల మంది ఓటర్లకు సంబంధించి అవకతవకలు గుర్తించామని....
కోల్‌కతా, డిసెంబరు 17: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) సందర్భంగా.. ఒక కోటీ 36 లక్షల మంది ఓటర్లకు సంబంధించి అవకతవకలు గుర్తించామని, వారిని విచారణకు రావాల్సిందిగా పిలిచామని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) మనోజ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఆయా వ్యక్తులకు సమాచారం ఇస్తున్నారన్నారు. ఎవరైనా అనివార్యమైన కారణాలతో విచారణకు రాలేకపోతే దానిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ను నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేశామన్నారు. పశ్చిమ బెంగాల్ ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం మంగళవారం ప్రచురించిన విషయం తెలిసిందే. వలసలు, మరణాలు, గైర్హాజరు తదితర కారణాలతో 58 లక్షలకుపైగా ఓట్లను తొలగించారు.