Share News

Pahalgam: కశ్మీర్‌కు మళ్లీ పర్యాటక కళ

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:31 AM

పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తరువాత ఇప్పుడు సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొన్నాయి. ఆంక్షలు ఎత్తివేయడంతో పర్యాటకులు సందడి చేయడం, అక్కడి అందాలను ఆస్వాదించడం ప్రారంభించారు.

Pahalgam: కశ్మీర్‌కు మళ్లీ పర్యాటక కళ

కశ్మీర్‌లో మళ్లీ కళ తిరిగి వస్తున్న పర్యాటకులు

ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్న హోటళ్లు

పర్యాటకులకు భద్రతా సిబ్బంది, స్థానికుల అండ

పహల్గాం, ఏప్రిల్‌ 28: అందమైన పైన్‌ చెట్లు, ఆకర్షించే ప్రదేశాలతో మిని స్విట్జర్లాండ్‌గా గుర్తింపు పొందిన పహల్గాంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏప్రిల్‌ 22న ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని బలిగొన్న తర్యాత కొన్ని రోజులపాటు స్తబ్దుగా ఉన్న ఆ ప్రాంతంలో ఆంక్షలు ఎత్తివేయడంతో మళ్లీ దేశీయులతో పాటు విదేశీ పర్యాటకులు సందడి చేస్తున్నారు. లిద్దర్‌ నది ఒడ్డున ఉన్న ప్రముఖ సెల్ఫీ పాయింట్‌ వద్ద ఫొటోలు దిగుతూ సరదాగా గడుపుతున్నారు. అలాగే అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు అక్కడి హోటళ్లు కూడా ప్రత్యేక డిస్కౌంట్లను అందజేస్తున్నాయి. పహల్గాంను చూసేందుకు కోల్‌కతా నుంచి వచ్చిన పర్యాటకుడు జయ్‌దీప్‌ ఘోష్‌ ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ, ‘‘పహల్గాంలో ఆంక్షలు ఎత్తివేశారని తెలుసుకొని మేము శుక్రవారం రోజు ఇక్కడకు వచ్చాం. మార్కెట్‌తో పాటు ఇంకా కొన్ని దుకాణాలు మూసి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఇక్కడ మొత్తం సాధారణంగానే ఉంది. కాల్పులు జరిగిన బైసరన్‌ లోయ ప్రాంతాన్ని మినహాయించి మిగతా అన్ని ప్రదేశాలను చూశాం. ఇక్కడి సెక్యూరిటీ సిబ్బంది, స్థానిక ప్రజలు మాకు ఎంతో సహకరిస్తున్నారు.’’ అని చెప్పారు. ఉగ్రవాదుల దాడికి ముందు పహల్గాంకు రోజుకు 3 వేల నుంచి 5 వేల మంది పర్యాటకులు వచ్చేవారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..

Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం

For National News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 04:31 AM