Share News

Nitin Nabin: బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నితిన్‌ నబీన్‌ బాధ్యతలు

ABN , Publish Date - Dec 16 , 2025 | 05:46 AM

బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నితిన్‌ నబీన్‌ ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు....

 Nitin Nabin: బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నితిన్‌ నబీన్‌ బాధ్యతలు

న్యూఢిల్లీ, పట్నా, డిసెంబరు 15: బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నితిన్‌ నబీన్‌ ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌ షా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం మధ్యాహ్నం పట్నా నుంచి ఢిల్లీకి చేరుకొన్న నితిన్‌ నబీన్‌కు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలకడం విశేషం. ఆయన బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలోనూ ఢిల్లీ సీఎంతో పాటు పలువురు ఢిల్లీ మంత్రులు పాల్గొన్నారు. పట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరే ముందు నితిన్‌ నబీన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా తనను నియమించడం పార్టీ ఆశీర్వాదంగా పేర్కొన్నారు. సామాన్య కార్యకర్తలను ఉన్నత పదవుల్లో నియమించేది బీజేపీ మాత్రమేనని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎన్నికల వ్యూహం ఏమిటని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘అది బెంగాల్‌ అయినా.. అసోం అయినా... మా పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు’’ అని పేర్కొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 05:46 AM