Nitin Gadkari: కుల రిజర్వేషన్లు పొందకపోవడం బ్రాహ్మణుడిగా నాకు అతిపెద్ద వరం
ABN , Publish Date - Sep 23 , 2025 | 05:19 AM
బ్రాహ్మణులకు కుల ఆధారిత రిజర్వేషన్లు లేకపోవడం ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా తనకు దేవుడిచ్చిన అతిపెద్ద వరం అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
నాకు కులమతాలపై విశ్వాసం లేదు: గడ్కరీ
నాగపూర్, సెప్టెంబరు 22: బ్రాహ్మణులకు కుల ఆధారిత రిజర్వేషన్లు లేకపోవడం ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా తనకు దేవుడిచ్చిన అతిపెద్ద వరం అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మరాఠా, ఓబీసీ, బంజారా రిజర్వేషన్లపై మహారాష్ట్రలో రాజకీయం వేడిక్కిన తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నాగపూర్‌లో సోమవారం జరిగిన హల్బా సమాజ్ మహాసంగ్ స్వర్ణోత్సవ కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగించారు. తనకు కులమతాల పట్ల విశ్వాసం లేదని స్పష్టం చేశారు. ఎవ్వరు కూడా కులాన్నో, మతాన్నో, భాషనో ఆఽధారంగా చేసుకొని గొప్పవారు కాలేరని.. కేవలం తమలోని లక్షణాల వల్లే గొప్పవారు అవుతారని నొక్కి చెప్పారు. తాను బ్రాహ్మణుడినని, బ్రాహ్మణులకు కుల ఆధారిత రిజర్వేషన్లు లేకపోవడమనేది తనకు జీవితంలో దేవుడిచ్చిన అతిపెద్ద వరమని వెల్లడించారు.