NHAI: వాహనంపై అతికించని ఫాస్టాగ్‌లు ఇకపై బ్లాక్‌లిస్ట్‌లోకి
ABN , Publish Date - Jul 12 , 2025 | 05:27 AM
టోల్‌గేట్ల వద్ద జాప్యానికి, ఇతర సమస్యలకు కారణమవుతున్న ‘లూజ్ ఫాస్టాగ్’లను బ్లాక్‌లి్‌స్టలో పెట్టాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించింది.
ఎన్‌హెచ్‌ఏఐ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ, జూలై 11: టోల్‌గేట్ల వద్ద జాప్యానికి, ఇతర సమస్యలకు కారణమవుతున్న ‘లూజ్ ఫాస్టాగ్’లను బ్లాక్‌లి్‌స్టలో పెట్టాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించింది. పలువురు ఫాస్టాగ్‌ను వాహనం ముందు అద్దం (విండ్‌షీల్డ్)పై అతికించడం లేదు. టోల్‌గేట్ వద్దకు వచ్చాక ఫాస్టాగ్‌ను తీసి చూపిస్తున్నారు. దీని వల్ల జాప్యం జరుగుతోంది. ఇతర వాహనాదారులకు అసౌకర్యం కలుగుతోంది. అంతేకాకుండా.. కొందరు లూజ్‌ఫాస్టాగ్‌లను దుర్వినియోగం చేస్తున్నారు.
కొన్నిసార్లు టోల్ రుసుము తిరిగి తప్పుగా సదరు లూజ్ ఫాస్టాగ్ ఖాతాలోకి వెళుతుండడాన్ని (బోగస్ చార్జిబ్యాక్స్) ఎన్‌హెచ్‌ఏఐ గమనించింది. ఈ నేపథ్యంలో టోల్ సేకరణ ఏజెన్సీలు లూజ్ ఫాస్టాగ్‌ల సమాచారం తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఈ-మెయిల్ ఐడీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. దానికి సమాచారం రాగానే ఆయా లూజ్ ఫాస్టాగ్‌లను బ్లాక్‌లి్‌స్టలో పెట్టేందుకు చర్యలు చేపడతామని పేర్కొంది.